![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -211 లో.....దాస్ కుబీర్ గురించి ఆలోచస్తుంటే.. కాశీ వచ్చి చేతిలో ఉందేంటని అడుగుతాడు.ఏం లేదంటూ వెళ్ళిపోతాడు. మా నాన్న ఎవరినో వెతుకున్నాడని స్వప్నతో కాశీ అంటాడు. ఆ తర్వాత శివన్నారాయణ దగ్గరికి సుమిత్ర వచ్చి.. కార్తీక్ పెళ్లి చేసుకున్న నుండి అసలు జ్యోత్స్న నిద్ర పోయింది లేదు. ఎప్పుడు చూసిన గదిలో లైట్ వేసి ఉంటుంది. దీనికి మీరే పరిష్కారం చూపాలి.. త్వరగా పెళ్లి చేసి అమెరికా పంపించాలని సుమిత్ర అనగానే.. నేను తన గురించే ఆలోచిస్తున్నాను.. రేపు నిర్ణయం తీసుకుంటానంటూ శివన్నారాయణ దశరథ్ ని పిలుస్తాడు. రేపు బోర్డు మీటింగ్ అరెంజ్ చెయ్ అందరికి మెసేజ్ పెట్టమని చెప్తాడు.
మరొక వైపు కార్తీక్, దీప ఇద్దరు కలిసి భోజనం చెయ్యాలని అనసూయ, కాంచన ఇద్దరు ప్లాన్ చేస్తారు. అందుకే ముందే భోజనం చేసి శౌర్యని పక్కకి తీసుకొని వెళ్లి భోజనం తినిపిస్తారు. కార్తీక్ ఒక్కడే భోజనం చేస్తూ బర్త్ డే రోజు కూడా ఒక్కడినే భోజనం చేస్తున్నానని కార్తీక్ ఫీల్ అవుతుంటే.. దీప పక్కన కూర్చొని భోజనం చేస్తుంది. దాంతో ప్లాన్ సక్సెస్ అంటూ అనసూయ, కాంచన ఇద్దరు అనుకుంటారు. దీపకి కార్తీక్ భోజనం వడ్డీస్తుంటే.. ఇద్దరు కలిసి భోజనం చేస్తుంటారు.
ఆ తర్వాత శౌర్యతో కార్తీక్ ని కార్తీక్ అని పిలువు.. నాన్న అని వద్దు అని కాంచన అంటుంది. మీ అమ్మ పిలవమని చెప్పేవరకు పిలవకు అని కాంచన, అనసూయ ఇద్దరు ప్లాన్ చెప్తారు. దానికి శౌర్య సరే అంటుంది. ఆ తర్వాత మావయ్య మీటింగ్ అని మెసేజ్ చేశాడని కాంచనకి కార్తీక్ చెప్తాడు. నేను సొంతంగా బిజినెస్ చేస్తాను. రేపు సిచువేషన్ బట్టి డిసైడ్ అవుతానని కార్తీక్ అనగానే.. వద్దు బాబు మీ తాతయ్య గారితో చెయ్యండి అని దీప అంటుంది. అప్పుడే శౌర్య వచ్చి.. కార్తీక్ రేపు స్కూల్ కి నన్ను తీసుకొని వెళ్తావా అని అనగానే.. అడుగుతుంది శౌర్య.. కార్తీక్ అంటుంది. అమ్మ, అనసూయ గారు అక్క, చెల్లి అనుకుంటున్నారు. వీళ్ళేదో సీక్రెట్ మిషన్ చేస్తున్నారు. సైలెంట్ గా అబ్సర్వ్ చెయ్యడం బెస్ట్ అని కార్తీక్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |